Awareness on Tuberculosis : క్షయ వ్యాధి పై అవగాహన నిర్వహించిన -డాక్టర్.సరిత

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ వరంగల్ జిల్లా ప్రతినిధి.. క్షయ వ్యాధి నిర్మించాలి.. డాక్టర్.ములుగు.సరిత క్షయ వ్యాధి నిర్మూలించాలని క్షయ వ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ ములుగు సరిత అన్నారు. వరంగల్ జిల్లా లోని దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో క్షయ వ్యాధి పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా డాక్టర్ ములుగు సరిత మాట్లాడుతూ క్షయ వ్యాధి లక్షణాలు అన్ని వ్యాధులు లాగానే కనిపిస్తాయని తరచుగా కనబడే అలసట తలనొప్పి బరువు తగ్గడం జ్వరము రాత్రిపూట చెమటలు పడడం ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని సంప్రదించాలని పలు సూచనలను ఏ.ఎన్.ఎం.లకు ఆశలకు తెలియజేశారు..

క్షయ వ్యాధి తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యల నుండి అనారోగ్యానికి దారితీస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు క్షయ వ్యాధి చికిత్స నివారణ విషయాలపట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం ఆసుపత్రిలోని రికార్డులను రిపోర్టులను మందులను పరిశీలించారు.

ఈ సమావేశంలో దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్.భరత్ కుమార్, టీ.బి సూపర్వైజర్ సుభాషిని, పబ్లిక్ హెల్త్ మేనేజర్ జన్ను కొర్నేల్, ఫార్మసీ ఆఫీసర్ ఎస్.అనిల్ కుమార్ , ఏ.ఎన్.ఎం.లు మరియు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Awareness on Tuberculosis - Dr. Sarita

You cannot copy content of this page

Scroll to Top