Chhatrapati Shivaji Jayanti : రామగుండం మేయర్ మహంకాళి స్వామి చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి.. రామగుండం మేయర్ మహంకాళి స్వామి సాహసానికి మారు పేరు ఛత్రపతి శివాజీ అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కొనియాడారు . ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని గురువారం జి . ఎం . కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి దేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన యోధుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు. ఆయన అవలంభించిన ధర్మ నిరతి , సర్వ మత సమ భావన ఆయన చూపిన బాట తరతరాలకు స్ఫూర్తి దాయకమని అన్నారు.

కార్పొరేటర్లు ముస్తఫా , గట్ల రమేష్ , దాసరి సాంబమూర్తి , కొలని కవిత , చిదురాల నాగ రాజు , కౌటం సతీష్ , నాయకులు వేగోళపు శ్రీనివాస్ , ఆరే కుల సంఘం నాయకులు సమ్మారావు , ఇతర ప్రతినిధులతో పాటు మీనేష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mayor Chhatrapati Shivaji Jayanti celebrations were grand

You cannot copy content of this page

Scroll to Top