Awareness : గంజాయి ముప్పు పై అవగాహన

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఆగస్టు 21 : అరకు సీఐ ఎల్.హిమగిరి అరకు సర్కిల్ పరిధిలోని గుంటసీమ హైస్కూల్‌లో గంజాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను విద్యార్థులకు వివరించారు. గంజాయి వాడకంతో ఆకలి మందగించడం, నరాల బలహీనత, జ్ఞాపకశక్తి హాసం, సంతాన లోపాలు, ఇన్ఫెక్షన్లు వంటి అనర్థాలు కలుగుతాయని చెప్పారు. విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువులో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Awareness on the threat of cannabis

You cannot copy content of this page

Scroll to Top