Follow Traffic Rules : ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించండి -S.i

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్.పెనుమూరు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ట్రాఫిక్ విషయం పై ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆటోలకు సంబంధించిన రికార్డులు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉండాలని. పాఠశాలల విద్యార్థులను జాగ్రత్తగా తీసుకుని వెళ్లాలని.

మద్యం సేవించి వాహనం నడప రాదని. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయరాదని తెలిపారు.ఓవర్ లోడుతో వెళితే ఆటోలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Auto drivers must strictly follow traffic rules

You cannot copy content of this page

Scroll to Top