Mon. Mar 9th, 2026

టోకూరు రోడ్డుకు మోక్షం సర్వే నిర్వహించిన అధికారులు త్వరలో పనులు ప్రారంభం

TRINETHRAM NEWS

అనంతగిరి ఫిబ్రవరి 11, (త్రినేత్రంన్యూస్): అనంతగిరి మండలంలోని టోకూరు పంచాయతీ ప్రజలకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బొర్రా మెయిన్ రోడ్డు భగ్మరవలస నుంచి టోకూరు గ్రామం వరకు కొత్త రహదారి నిర్మాణానికి మంగళవారం సర్వే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సర్వే కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ (ప్రాజెక్టు) గణేష్, స్థానిక సర్పంచ్ కిల్లో మోస్య, మాజీ సర్పంచ్ సారా దొన్ను, సీపీఎం నాయకుడు గెమ్మెల దేవన్న తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కిల్లో మోస్య మాట్లాడుతూ, టోకూరు, కొండిభ పంచాయతీల ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా గుంతలతో నిండిన రోడ్డు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేశామని చెప్పారు.
ప్రభుత్వం స్పందించి రోడ్డును మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమై ప్రజల కష్టాలు తీరనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సహకారానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రహదారి నిర్మాణంతో టోకూరు, కొండిభ గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభమై, అభివృద్ధికి దోహదపడుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Officials who conducted the survey will

Related Post

You cannot copy content of this page