ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Attempted suicide

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి . సమగ్ర విచారణ చేయాలి. బీఆర్‌ఎస్‌వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ.

Attempted Suicide : దేవరకొండ డివిజన్ ఆగస్టు 26, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్‌వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.
బుధవారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు చేసిన ఆరోపణల ప్రకారం లెక్చరర్ల వేధింపులు, తరగతి గదిలో పరుష పదజాలంతో దూషించడం, చదువులో వెనుకబడుతున్నామనే ఒత్తిడి వంటి కారణాలతో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎన్‌సీ, సంబంధిత లెక్చరర్లపై విచారణ జరిపి, తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణ డిమాండ్ చేశారు. విద్యార్థులకు భయరహితమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.బాధితుల్లో ఆదిరాల వైష్ణవి మరో విద్యార్థిని బాపిశాక భానును వీరిద్దరూ కొండమల్లేపల్లి కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతున్నారని తెలిపారు.విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని బొడ్డుపల్లి కృష్ణ ఉన్నతాధికారులను కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page