సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Mother Teresa Birth Anniversary

Mother Teresa Birth Anniversary : దేవరకొండ డివిజన్ ఆగస్టు 26, త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిసా 116 వ జయంతి వేడుకలు స్థానిక బీ సీ బాలికల వసతి గృహమునందు నిర్వహించడం జరిగింది. మదర్ థెరిసా పటానికి అధ్యక్షుడు ఎన్ వీ టీసభ్యులతో కలసి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. అనంతరం వారు మాట్లాడుతూ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ 1950 లో కలకత్తాలో స్థాపించి 45 సంవత్సరాల పాటు సేవా కార్యక్రమాలు చేసినారని, 1929లో భారతదేశానికి వచ్చారు. కలకత్తాలోని పాఠశాలలో కొన్ని సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.

అనాధలకు రోగగ్రస్తులకు పేదలకు సంస్థ ద్వారా కుష్ఠురోగులు, అనాథలు, మరణిస్తున్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి వారి చివరి క్షణాలలో గౌరవం అందించారు.1979లో నోబుల్ శాంతి పురస్కారం అందజేయగా 1980లో భారత దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందడం జరిగింది అని ఈ సందర్భంగా వారు అన్నారు. ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఆడపిల్లలు ఆమె ఆశయ సాధనకై పోరాడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, వల్లమల్ల ఆంజనేయులు ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు, కరాటే మాస్టర్ గోపి, వీ వి ఆర్, ఎస్ ఎఫ్ ఐ డివిజన్ కార్యదర్శి వెంకటేష్, రాజేష్, మల్లయ్య, భాగ్యలక్ష్మి, రాజేశ్వరి, రాము, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page