WhatsApp Image 2024 11 01 at 10.59.40
Trinethram News : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా:-
మండపేట
8 మందిపై అట్రాసిటీ కేసు నమోదు : సీఐ దొర రాజు
ముగ్గురు దళిత యువకులపై అగ్రవర్ణాల దాడి ఘటనలో ఏడిద గ్రామానికి చెందిన 8 మంది పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు మండపేట రూరల్ సీఐ పి. దొర రాజు తెలిపారు.
శుక్రవారం ఉదయం ఆయన మాట్లాడుతూ 8 మందితో పాటు మరి కొందరు ఈ కేసులో నిందితులుగా వున్నారని, వారందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
కాగా మరి కొన్ని విషయాలను ప్రశ్నించగా బాధితులకు సత్వర న్యాయం చేసే విషయం లో కొన్ని వివరాలు వెల్లడి చేయడం కేసు పురోగతికి అడ్డు వస్తుందని వెల్లడించేందుకు నిరాకరించారు.
నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
