Kolikapudi Srinivas Rao : నూతన అధ్యక్షులు నియామకం

TRINETHRAM NEWS

తేదీ : 05/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ గురునాన కాలనీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గన్నె. ప్రసాద్ లతో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరువూరు పట్టణం, నియోజకవర్గం రూరల్ , గంపలగూడెం, విస్సన్నపేట, టిడిపి నూతన అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని అనుసరించి టిడిపి సంస్థాగత వెన్నక ప్రక్రియ జరిగిందన్నారు. రాబోయే స్థానిక సంస్థ గత ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించే విధంగా కృషి చేయాలన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ టిడిపి గత రెండు నెలలుగా తిరువూరు నియోజకవర్గ స్థాయిలో అబ్జర్వర్ సుఖవాసి. శ్రీనివాసరావు నాయకత్వంలో ప్రతి గ్రామంలో సుమారు తొంబై ఆరు గ్రామాలలో కమిటీల కోసం సమావేశాలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. పోటీ ఉన్నచోట మెజార్టీ అభిప్రాయ ప్రకారం , పోటీ లేనిచోట ఏకగ్రీవంగా పట్టణ, మండలం, గ్రామం కమిటీలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. కొత్తగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షులు పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేయాలని ఆకాంక్షిస్తూ అందరికీ అభినందనలు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే తిరువూరు పట్టణం టిడిపి నూతన అధ్యక్షులు మల్లెల. శ్రీనివాసరావు, రూరల్ మండల టిడిపి పార్టీ అధ్యక్షులు దుబ్బాక. వెంకటేశ్వర్లు, గంపలగూడెం మండల టిడిపి అధ్యక్షులు మానికొండ .రామకృష్ణ, విస్సన్నపేట మండలం టిడిపి అధ్యక్షులు రాయల. సుబ్బారావు ఎన్నుకున్నట్లు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో ఎన్నికల రాష్ట్ర పరిశీలికుడు నవనీతం. సాంబశివరావు, ఎన్నికల పరిశీలకులు రామినేని. రాజశేఖర్, ఎస్ .ఎమ్. పైజాన్ వల్లూరి. మధు సుధారావు, ఏచూరి. రాము పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Appointment of new presidents

You cannot copy content of this page

Scroll to Top