
Industrial Development : త్రినేత్రం న్యూస్ : విశాఖ : ఉక్కు రంగంలో రాష్ట్రానికి అతి పెద్ద పెట్టుబడి – రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న దిగ్గజ సంస్థలు… అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు రేపు భూమి పూజ… కేంద్ర మంత్రులతో కలిసి ప్లాంటుకు రేపు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు… ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం – లక్ష మందికి ఉద్యోగావకాశాలు… గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రెండు దశల్లో సాకారం
అనుబంధంగా రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ – మరో 6 వేల ఉద్యోగాలు… ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో పరిశ్రమల హబ్‌గా విశాఖ ఎకనమిక్ రీజియన్… జాతీయ, అంతర్జాతీయ ఉక్కు మార్కెట్‌లో ఏఎంఎన్ఎస్ ఇండియా భవిష్యత్‌లో కీలక పాత్ర… ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని విధాలా సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… స్టీల్ ప్లాంట్‌ను ఎన్‌హెచ్-16తో కలిపేలా శరవేగంగా 4 లేన్ రహదారి విస్తరణ పనులు
రేపు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి తరలి వస్తున్న ప్రభుత్వ ప్రముఖులు – ఉక్కు సంస్థల ప్రతినిధులు.. మధ్యాహ్నం నేరుగా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు ముఖ్యమంత్రి చంద్రబాబు… మధ్యాహ్నం 3.40 గంటలకు ఎక్స్‌పీరియన్స్ జోన్ సందర్శన, ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్ పరిశీలన
అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన ఫలకం ఆవిష్కరించనున్న సీఎం… సాయంత్రం 4.50 గంటలకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం… భూమిపూజకు వస్తున్న ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నారాయణ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రతినిధులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

