Funds for Steel Plant : విజయనగరం జిల్లాలో స్టీల్ ప్లాంట్ కు 1,085 ఎకరాలు కేటాయింపు

TRINETHRAM NEWS

8,570 కోట్లతో ఏర్పాటుచేయనున్న సూపర్ స్మెల్టెర్స్

Trinethram News : విజయనగరం జిల్లా గుర్ల మండలం కెళ్ల గ్రామంలో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు వీలుగా సూపర్ స్మెల్టెర్స్ లిమిటెడ్ కు 1,085 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ సంస్థ 8,570.50 కోట్లతో ఏడాదికి 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో స్టీల్స్టాంట్ ఏర్పాటు చేస్తుంది. దీనిద్వారా 750 మందికి ఉపాధి కలగనుంది. టౌన్ షిప్ ఏర్పాటుకు మరో 97.04 ఎకరాలు, రైల్వే సైడింగ్కు 53.35 ఎకరాలు కూడా కేటాయించనున్నారు. రెండు దశల్లో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

1,085 acres allocated for steel plant

You cannot copy content of this page

Scroll to Top