Investment Opportunities : పెట్టుబడులు వచ్చే అవకాశం

TRINETHRAM NEWS

తేదీ : 09/12/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం సమీపంలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీస్ బాయిలర్స్ ఇన్సూరెన్స్ మరియు మెడికల్ సర్వీసెస్ మంత్రి వాసంశెట్టి. సుభాష్ , శాసనసభ్యులు బొలిశెట్టి. శ్రీనివాస్ స్వగృహమునందు మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది. కూటమి ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల. పవన్ కళ్యాణ్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వెలుగుల వస్తాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పి. నాలుగు లో భాగంగా ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. అభివృద్ధిలో భాగంగా దాతల సహకారంతో జిల్లా పరిషత్ పాఠశాల, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం వంటి అనేక అభివృద్ధి పనులను చేయడం హర్షణీయమని కొనియాడారు. రానున్న కాలంలో అనేక పెట్టుబడులు నియోజకవర్గ అభివృద్ధికి వచ్చే అవకాశం మెండిగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Investment opportunities

You cannot copy content of this page

Scroll to Top