Trinethram News : Nov 04, 2025, ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. సమ్మన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్‌నగర్ నుండి అక్బర్‌పూర్ వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులో నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


