
Anna-Akka Mentorship : దేవరకొండ డివిజన్ జులై 04, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో “”అన్న – అక్క ” మెంబర్షిప్ ఏఐ , మరియు డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమావత్ రవి మాట్లాడారు .
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో మంచి నైపుణ్యం ఏర్పడుతుందని, ప్రస్తుత ఏఐ తరుణంలో ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందని డిగ్రీ విద్యార్థులకు ఇదొక మంచి సువర్ణ అవకాశం మీరు నేర్చుకొని పాఠశాల విద్యార్థులకు బోధించడం ద్వారా మీకు కూడా పర్సనల్ డెవలప్మెంట్ అవుతుందని ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో అదనపు నైపుణ్యాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్లుగా జి.లింగారెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్, బి.సురేష్ లెక్చరర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసి కోఆర్డినేటర్ డా. కె.పృథు, ఎ.శ్రీను, వి.వెంకటేష్, వి. యాదయ్య, పి.కొండల్, ఎస్.నర్మదాదేవి, ఎం. జగపతి బాబు , కె.నాగరాజు , అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe