జూలై 26, 2026
TRINETHRAM NEWS
Mala Mahanadu protest

–నేడే హలో మాల ఛలో ఇంద్ర పార్క్….

మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి .

Mala Mahanadu Protest : దేవరకొండ డివిజన్ జులై 04, త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కు విరుద్ధంగా.. ఏంపరికల్ డాటా పరిగణలోకి తీసుకోకుండా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం చేసిన వర్గీకరణ రద్దు చేయాలి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జన గణన చేయకుండా ఎస్సీ మాల జనాభాను తక్కువ చూయిస్తూ ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు అన్యాయం చేసిందని అన్నారు రోస్టర్ విధానాన్ని అమలు చేసిన విధానాన్ని ఖండిస్తూ ఆదివారం హైదరాబాదు ఇంద్ర పార్క్ లో జరిగే మాల మహానాడు ధర్నాను దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాల నుండి మాల మేధావులు యువకులు ప్రజలు వేలాదిగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని మలమహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తీరును నిరసిస్తూ అదేవిధంగా రోస్టర్ విధానంలో మాలలకు తీవ్ర నష్టము జరిగిందని అన్నారు… మాలలంతా ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి అధికారంలోకి రావడానికి కృషి చేసినప్పటికీ… కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు అన్యాయ చేయడం జరిగింది.

అన్నారు రోస్టర్ విషయంలో రాష్ట్రంలో ఉన్న అందరూ మన మాల ఎం ఎల్ ఏ లు,, ఎం పీ , ఎం ఎల్ సి లు.. ఇతర ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వచ్చే ఎలక్షన్స్ లో మాలల పంతం – కాంగ్రెస్ ప్రభుత్వం అంతం అనే నినాదంతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు ఆనాడు ..పదవుల కోసం, పార్టీలకు వారసులం అనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్… మనకు ఇన్ని హక్కులు సాధించేవారు కాదు…
కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవికి(ఒక రాష్ట్ర సీఎం తో సమానం) రాజీనామా చేయడం… మన ప్రజా ప్రతినిధులకు గుర్తు చేయాలి.. అని రాబోయే రోజులలో విద్య ఉద్యోగ, అవకాశాలలో మాలలు మేలుకోకపోతే రాబోయే తరాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page