Petitions with AI : ఏఐతో పిటిషన్లు.. సుప్రీంకోర్టు ఆందోళన

TRINETHRAM NEWS

Trinethram News : న్యాయవాదులు ఎడాపెడ ఏఐ టూల్స్‌ను ఉపయోగించడాన్ని ప్రశ్నించింది. న్యాయవాదులు ఏఐని ఉపయోగించి పిటిషన్ల డ్రాఫ్ట్‌లను తయారు చేస్తున్న విధానం పెరుగుతుండటం పట్ల చీఫ్‌ జస్టిస్‌ సూర్య కాంత్‌ నేతృత్వంలోని జస్టిస్‌లు వీబీ నాగరత్న, జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఏఐని వినియోగిస్తూ ‘మెర్సీ వర్సెస్‌ మ్యాన్‌కైండ్‌’ లాంటి ఉనికిలో లేని తీర్పులను కూడా ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నది. అలాంటి వాటిని తనిఖీ చేయడం చాలా కష్టతరంగా ఉందని, కొన్ని తీర్పులను ప్రస్తావించడం సబబుగానే ఉన్నప్పటికీ, అందులో నకిలీ కొటేషన్లను కూడా ఆపాదిస్తున్నారని, ఇది న్యాయమూర్తులకు అదనపు భారంగా మారిందని తెలిపింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Petitions with AI.. Supreme Court concerns

You cannot copy content of this page

Scroll to Top