Chalo Medical College : ఛలో మెడికల్ కాలేజ్” నిరసన కార్యక్రమానికి తరలి వెళ్ళిన అనపర్తి యువజన విభాగం శ్రేణులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి, చంద్రబాబు పక్కా రాజకీయ వ్యాపారి..తన బినామీల కోసమే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ… ప్రజల ఆరోగ్యానికి కీలకమైన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్‌ఆర్‌సీపీ యువజన,విద్యార్థి విభాగం శుక్రవారం రాజమహేంద్రవరం లో “ఛలో మెడికల్ కాలేజ్” ఉద్యమాన్ని చేపట్టింది. అనపర్తి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు పడాల దుర్గారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో అనపర్తి, బిక్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాల నుండి యువజన విభాగ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

ఈ ర్యాలీని జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించగా, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి విజయ్ రెడ్డి, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాల యువజన విభాగ కన్వీనర్లు పులగం వీర్రెడ్డి, సత్తి సత్యనారాయణ రెడ్డి(పెద్ద), కొటికలపూడి గణేష్ పాటు స్థానిక యువజన విభాగ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

protest program at Chalo Medical College

You cannot copy content of this page

Scroll to Top