Industrial Field Visit : అనపర్తి బాలికోన్నత పాఠశాల విద్యార్థినుల ఇండస్ట్రియల్ ఫీల్డ్ విజిట్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరిజిల్లా, అనపర్తి నియోజకవర్గం అనపర్తి, ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్ష వారు నిర్వహిస్తున్న వృత్తివిద్య కోర్సుల్లో భాగంగా విద్యార్థులకు ఎల్ ఎన్ జె స్కిల్స్ వారి సహకారంతో అనపర్తి బాలికోన్నత పాఠశాల విద్యార్థినుల కు ఇండస్ట్రియల్ విజిట్ నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నిర్వహిస్తున్న వృత్తి విద్య కోర్సులను ఒకేషనల్ కోర్సు టీచర్స్ చే శిక్షణా కార్యక్రమం పాఠశాలలో జరుగుతున్నది దీనిలో భాగంగా మొదటి ఫీల్డ్ విజిట్ జరిగినదని వృత్తి విద్యా నైపుణ్యాల పెంపొందించేందుకు ఫీల్డ్ విజిట్ లు దోహదపడతాయని ప్రధానోపాధ్యాయిని కె కళ్యాణి తెలియజేశారు.ఈసందర్భంగా పాఠశాల చైర్మన్ నల్లమిల్లి విజయలక్ష్మి, వైస్ చైర్మన్ తాడి కవిత, మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సులు విద్యార్థులు దాగి ఉన్న నైపుణ్యత ను, ఉపాధి అవకాశాలు కు ఎంత గానో తోడ్పడతాయని తెలియజేశారు. సందర్శనలో శ్రీ సత్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ డిజైన్ షాప్ ను 80 మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సందర్శించడం జరిగినది.
ఈ సందర్భంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అది పని చేయు విధానం దాని ఆపరేటి దాని ఉపయోగం అలాగే చేతితో చేసిన మగ్గం వర్క్ దారము తయారీ విధానము డయింగ్, డిజైనింగ్ జరిగే విధానము చేనేత పనిముట్ల సహాయంతో వస్త్రాలు తయారీ విధానం పనితీరు అన్నిటినీ విద్యార్థినిలు సంపూర్ణంగా అవగాహన చేసుకున్నారనీ ఒకేషనల్ ట్రైనర్ నాగమణి తెలియజేశారు. సొసైటీ వివరాలను అధ్యక్గురలుశ్రిమతిసత్య విద్యార్థులకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా ప్రతి ప్రక్రియను వివరించారు. ఈ సందర్శన ఆద్యంతం సందర్శకుల మదిలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంద అని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్శనలో ఉపాధ్యాయులు ,పభ,శిరీష, కవిత భాసీర్ బేగం బేబీ తల్లి త్రిమూర్తులు రాజు, ఒకేషనల్ ట్రైనర్ సౌజన్య విద్యార్థినిలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Industrial Field Visit

You cannot copy content of this page

Scroll to Top