జూన్ 30, 2026

WhatsApp Image 2024 02 05 at 8.57.40 PM

TRINETHRAM NEWS

అన్నమయ్య జిల్లా ములకలచెరువు

రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు నుంచి కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం ములకల చెరువు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండలం లోని బురకాయల కోట సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కలో ఒ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్ళి ఉండటాన్ని పశువుల కాపరులు గుర్తించారు.

వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

స్పందించిన ఎస్సై తిప్పేస్వామి, ఏఎస్ఐ నజీర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

రైల్వే ఎస్ఐ రహీం ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

You cannot copy content of this page