An Intimate Meeting : అనంతగిరి ఏకలవ్య పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం

TRINETHRAM NEWS

“మనిషి జీవితానికి ఇంటర్మీడియట్ ఒక కీలక మెట్టు” – జడ్పీటీసీ దీసరి గంగరాజు

అనంతగిరి మార్చి 1, (త్రినేత్రం న్యూస్): అనంతగిరి మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో 10వ తరగతి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. సన్యాసినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ దీసరి గంగరాజు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని పేర్కొన్నారు. 10వ తరగతి పూర్తి చేసిన అనంతరం ఇంటర్మీడియట్ దశ విద్యార్థుల జీవితంలో ఎంతో కీలకమని, అది భవిష్యత్ లక్ష్యాలకు బాటలు వేసే ముఖ్యమైన మెట్టుగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టులను ఎంపిక చేసుకొని కృషితో ముందుకు సాగాలని సూచించారు.
ఏకలవ్య పాఠశాలలో నాణ్యమైన బోధనతో ఉత్తమ ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తున్నారని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు. పదో తరగతి పూర్తయ్యిన వెంటనే ఇంటర్మీడియట్‌లో సరైన కోర్సును ఎంచుకొని ఉత్తీర్ణత సాధించేందుకు శ్రమించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ప్రిన్సిపాల్ ఎం. సన్యాసినాయుడు మాట్లాడుతూ, అరకు వ్యాలీ అనంతగిరి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయ సిబ్బంది సమష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు తెలియని అంశాలను బోధిస్తూ, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. తల్లిదండ్రులు కూడా అదే స్థాయిలో బాధ్యత వహించి, పిల్లలను మంచి పనుల వైపు ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా మాధ్యమిక దశ పూర్తయ్యే వరకు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అనంతగిరి సర్పంచ్ సోమెల రూతు, పాఠశాల చైర్మన్ మహేష్, వైస్ చైర్మన్ దీసరి దేవుడమ్మ, ఉపాధ్యాయులు తిరుపతిరావు, మోహన్ నాయక్ తదితరులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమావేశం విద్యార్థులకు ప్రోత్సాహం నింపుతూ, భవిష్యత్ లక్ష్యాల వైపు దిశానిర్దేశం చేసే వేదికగా నిలిచింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

An intimate meeting of parents

You cannot copy content of this page

Scroll to Top