తేదీ : 01/01/2026. పోలవరం జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం కూటమి నాయకులు డైనమిక్ శాసనసభ్యులు చిర్రి. బాలరాజు కు , నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ , రాష్ట్ర ట్రైకా ర్ చైర్మన్ బొరగం.
శ్రీనివాసరావుకు రెండు వేల ఇరవై ఆరు వ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్లు మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖ సంతోషాలు నిండి ఉండాలని అన్నారు వాళ్లు చేసే వృత్తులలో ధన లాభం చేకూరి, ఎటువంటి కష్టనష్టాలు రాకుండా, లేకుండా చూడాలని సూచించారు.
మంచి ఆరోగ్యంతో ఉండాలని, ప్రతి ఒక్కరూ నీతి ,నిజాయితీ , ధర్మం వైపు ముందుండాలని, మంచి మనస్తత్వంతో ఎటువంటి విభేదాలు రాకుండా, లేకుండా ఉండాలని పేర్కొన్నారు.
అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించిందని గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ ,జడ్పిటిసి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వం వందకు వంద శాతం విజయం సాధిస్తుందని తెలిపారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా రాష్ట్రంలోని శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రులు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేస్తున్నారని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


