వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ నేతల మీద తప్పు ఆరోపణలు చేస్తే చట్ట పరమైన , న్యాయ పరమైన చర్యలు తప్పవనీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి రాజశేఖర్ ఆవుటి అన్నారు.మంగళవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ…వికారాబాద్ లోని ఓ సోషల్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ప్రకటనలో బాగంగా ముఖ్యమంత్రి పేరును బద్నాం చెయ్యడానికి మాట్లడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
గౌరవ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లి నిజ నిజాలు నిగ్గుతేల్చి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల రఘువీరా రెడ్డి పై అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద..పరువునష్టము కేసును ఫైల్ చేయడం కూడ జరుగుతుందని హెచ్చరించారు.సర్పన్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ నాయకుల పై చేసిన నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నా. అంతారం నుండి మోమిన్ కలాన్ రోడ్డు మంజూరైన సందర్భంగా రోడ్డు పనుల నిమిత్తం అంతారంలోని సర్వే నంబర్ 32 లో 1.16 గుంటలు ప్రభుత్వ భూమిలో కాంట్రాక్టర్లు మట్టి తరలిస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ రోడ్డు పనికి, కాంగ్రెస్ నాయకుడు రఘువీరా రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


