జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, వెలగతోడు, వల్లూరు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) చైర్మన్ లు గా నియమితులైన వల్లూరి వీరవెంకట సత్యనారాయణ (అబ్బు), గుత్తుల శ్రీనివాసు లు మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు,ని మర్యాదపూర్వకంగా కలిసారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పిఎసిఎస్ చైర్మన్ లు, మెంబర్లు గా నియమితులైన వారందరినీ ఎమ్మెల్యే వేగుళ్ల దుశ్శాలువాతో సత్కరించారు. వెలగతోడు పిఎసిఎస్ మెంబర్లు గా సరాకుల అబ్బులు, బోనగిరి సూర్యారావు లు, వల్లూరు పిఎసిఎస్ మెంబర్లు గా చల్లా సూర్యనారాయణ, మాత వరప్రసాద్ బాబు లు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Velagathodu, Vallur PACS new

You cannot copy content of this page