Congress : రాజీవ్‌ గాంధీ సేవలు చిరస్మరణీయం

TRINETHRAM NEWS

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు

రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్‌ గాందీ 34వ వర్ధంతి సందర్బంగా స్థానిక సీతంపేట వాటర్‌ ట్యాంకుల పార్కు ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అబ్ధుల్లా షరీఫ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నగర ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు, డిసిసి ఉపాధ్యక్షుడు దేవత సుధాకర్‌ మాట్లాడారు. భారతదేశ ఐక్యత కాపాడాలన్న రాజీవ్‌ గాంధీ సిద్ధాంతమే నేడు అందరికీ ఆదర్శమని కొనియాడారు. మన దేశ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి పితామహుడుగా, టెలికమ్యూనికేషన్‌ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్‌ గాంధీ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు , యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు.

దేశానికి సాంకేతిక విద్యను పరిచయం చేసి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నవ భారత నిర్మాత రాజీవ్‌ గాంధీ అన్నారు. నేడు అన్ని రంగాల్లో మన దేశం అగ్రగామిగా ఉందంటే ఆది ఆనాటి రాజీవ్‌ గాంధీ కృషి ఫలితమేనని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనే యువత నేడు రాజకీయాల్లో కొనసాగుతున్నారని, కాంగ్రెస్‌ పార్టీలో యువతను ప్రోత్సహించి మంచి అవకాశాలు కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా దేశాన్ని ముందుకు నడిపించి పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, నాయకులు జాహెద్‌ అక్తర్‌, ఎండి ఫిరదౌజ్‌, ఎండి షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajiv Gandhi's services are

You cannot copy content of this page

Scroll to Top