AITUC : సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల కమీటి లిస్ట్ ను ఎస్.ఎస్.ఓ కు అందజేసిన ఏఐటియుసి నాయకులు

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు గా విధులు నిర్వహిస్తున్న వారికి ఏఐటియుసి నూతన కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ లిస్ట్ ను ఆర్జీ వన్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి కి అందజేసి నూతన కమిటీని పరిచయం చేయడం జరిగిందని గుర్తింపు సంఘం ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ పేర్కొన్నారు.

శుక్రవారం ఆర్జీ వన్ సెక్యూరిటీ కార్యాలయం లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల కమీటి ని పరిచయం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డు లు గా విధులు నిర్వహిస్తున్న వారికి కనీస వేతనాలు అమలు చేయాలని, చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు, అదేవిధంగా సింగరేణి ఆస్తులను కాపాడటం లో కృషి చేస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సంక్షేమానికి ఏఐటియుసి కృషి చేస్తుందని ఆయన అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీను, ఏఐటియుసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆర్జీ వన్ అద్యక్షులు ఎం.ఎ.గౌస్ తో పాటు ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల నూతన కమిటి సభ్యులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AITUC leaders have submitted

You cannot copy content of this page

Scroll to Top