Collector : ఈ 15 రోజుల వ్యవధిలో ఆధార్ అప్డేషన్ కు కావలసిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి

TRINETHRAM NEWS

*ఆధార్ అప్డేట్ ప్రత్యేక క్యాంపు పై పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, జూలై -18: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆగస్టు 5 నుంచి 8 వరకు కలెక్టరేట్ లో ఆధార్ అపడేషన్ కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు నూతనంగా ఆధార్ కార్డు పొందేందుకు మీసేవ ద్వారా అడ్రస్ తో జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ , తల్లి లేదా తండ్రి అప్ డేట్ చేసిన ఆధార్ కార్డు ఉండాలని అన్నారు.

ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు కోసం ఓటర్ ఐడి లేదా పాస్ పోర్ట్ లేదా నివాస సర్టిఫికెట్, బ్యాంకు పుస్తకం/ పోస్టల్ బుక్ తో సహా అటెస్టడ్ దరఖాస్తు ఫారం ఉండాలని కలెక్టర్ తెలిపారు ఆధార్ కార్డులు పేరు స్పెల్లింగ్ పొరపాట్ల సవరణకు ఓటర్ ఐడి లేదా పాస్ పోర్ట్ లేదా ప్యాన్ కార్డు లేదా ఎస్.ఎస్.సి మార్కుల మెమో లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా మైనర్ ఐతే బర్త్ సర్టిఫికెట్ ఉండాలని, పెళ్లి తర్వాత పేరు మార్పు కోసం సబ్ రిజిస్టర్ జారీ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్ , పెళ్లి ఫోటో, ఇతర గుర్తింపు కార్డులు ఉండాలని, పూర్తిగా పేరు మార్పు కోసం గెజిటెడ్ చేసి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు ఆధార్ కార్డు లో డేట్ అఫ్ బర్త్ కరెక్షన్ కోసం బర్త్ సర్టిఫికెట్ , 21 సంవత్సరాల పైబడిన వారికి ఫోటో తో కూడిన మార్కుల మెమో లేదా ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలని అన్నారు.

ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ కోసం బయట 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఈ క్యాంపులో అవసరం లేదని అన్నారు ఆధార్ అప్డేషన్ అవసరం ఉన్నవాళ్లు ఈ 15 రోజుల వ్యవధిలో కావలసిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసే ఆధార్ అప్డేట్ క్యాంపు ను అవసరమైన ప్రజలు, ఉద్యోగులు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The documents required for

You cannot copy content of this page

Scroll to Top