
AISF 90th Anniversary Celebrations : డిండి(గుండ్ల పల్లి) సెప్టెంబర్ 24, త్రినేత్రం న్యూస్. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ( ఏ ఐ ఎస్ ఎఫ్) 90వ వార్షికోత్సవ వేడుకలను విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు సురిగి వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. డిండి మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యతిధిగా పాల్గొని విద్యార్థుల సమక్షంలో వార్షికోత్సవ గోడపత్రికలను (పోస్టర్లను) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సురిగి వినయ్ కుమార్ మాట్లాడుతూ… ఈ నెల 28,29,30 తేదీల్లో హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయని తెలిపారు. దేశంలో విద్యార్థుల హక్కుల పోరాటంలో,నాణ్యమైన విద్య సాధనలో ఏఐఎస్ఎఫ్ పోషిస్తున్న పాత్ర అనితరసాధ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు కళ్లెం సిద్ధు,చింటూ,వికాస్,కుమార్,తమీమ్,నిఖిల్ స్థానిక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe