సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Devarakonda Fort

పర్యాటకంగా మరింత అభివృద్ధి. రూ.75 లక్షలు మంజూరు.. ఎమ్మెల్యే బాలు నాయక్*

Devarakonda Fort : దేవరకొండ, సెప్టెంబరు 24: త్రినేత్రం న్యూస్. దేవరకొండ ఖిల్లా, ఖిల్లా గుట్టను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. ఖిల్లా అభివృద్ధికి ఇప్పటికే రూ.75 లక్షలు మంజూరయ్యాయని, ఖిల్లా గుట్ట సమగ్ర అభివృద్ధి కోసం సుమారు రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును దేవరకొండకు తీసుకొచ్చి రూ.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించనున్నట్లు వెల్లడించారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దేవరకొండ మున్సిపల్‌ (ఖిల్లా) పార్క్‌లో నిర్వహించిన యువ టూరిజం క్లబ్ జిల్లా స్థాయి పోటీలకు ఎమ్మెల్యే బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ ప్రాంతానికి చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి పరంగా ఎంతో ప్రత్యేకత ఉందన్నారు.

ఖిల్లాపై పూర్ణకుంభం.. ప్రత్యేక చరిత్ర

దేవరకొండ ఖిల్లాకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ ఎమ్మెల్యే మాట్లాడారు..
ఖిల్లా గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

ఖిల్లాకు రోప్‌వే ఏర్పాటు చేసే ఆలోచన

దేవరకొండ ఖిల్లాకు వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా రోప్‌వే ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. రోప్‌వే ఏర్పాటుతో ఖిల్లా ప్రాంతానికి మరింత పర్యాటక ఆకర్షణ పెరుగుతుందని, స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
పర్యాటకాభివృద్ధితో ఉపాధి అవకాశాలు
దేవరకొండ ఖిల్లా, ఖిల్లా గుట్టను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నారు. పర్యాటక రంగం అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. స్థానిక కళలు, హస్తకళలు, ఆహార ఉత్పత్తులు, చిన్న వ్యాపారాలకు కూడా పర్యాటక రంగం ద్వారా ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నర్సింహా, హనుమంతు వెంకటేష్ గౌడ్, మహమ్మద్ రైస్, కౌన్సిలర్లు, మారుపాకుల సురేష్ గౌడ్, లోకసాని శ్రీధర్ రెడ్డి, కిన్నెర హరికృష్ణ, ఉమేర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యాశాఖ అధికారులు, యువ టూరిజం క్లబ్ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page