AISF : సమస్యల నిలయంగా ఏకలవ్యలు

TRINETHRAM NEWS

విద్యార్థుల పరిస్థితి అయోమయం

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం ముకమామిడి గ్రామంలో గల ఈ ఎమ్ ఆర్ ఎస్ ఏకలవ్య మోడల్ పాఠశాలలో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతూ గత మూడు రోజుల నుంచి మంచినీటి సౌకర్యం లేక అవస్థలు పడుతున్న పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు స్పందించకుండా విద్యార్థుల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని కనీసం విద్యార్థులు తమ కాల కృత్యాలను వెళ్ళడానికి కూడా నీటి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారని ప్రతిష్టాత్మకంగా కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి విశాలాంతమైన ప్రాంతంలో నూతన బిల్డింగ్ నిర్మించిన కనీస వసతులు లేకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఏకలవ్య పాఠశాల నిర్మించి విద్యార్థులను ఇబ్బందులు గురి చేస్తున్న పట్టించుకునే నాధుడే లేడని భాష రాణి ఉపాధ్యాయులుగా నార్త్ ఇండియా నుంచి నియమించి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతి విధానాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిస్థితులు ఇక్కడ ప్రజల జీవన విధానాన్ని ఇక్కడ విద్యార్థుల యొక్క భాషా నైపుణ్యాన్ని తెలుసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించాలని ఏకలవ్యాల్లో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ములకలపల్లి మండల లో గల ఏకలవ్య పాఠశాల ఉపాధ్యాయుల యొక్క తీరు చాలా ఇబ్బందికరమైన వాతావరణంగా చదువుని చెప్పాల్సినటువంటి గురువులే గిరిజన విద్యార్థులని చిన్నచూపు చూస్తూ వాళ్ల తల్లిదండ్రులను సైతం అవమాన పరుస్తూ వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని ఏకలవ్యలో ఉన్నత అధికారి ఆర్ సి ఓ అరుణ కుమారి స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొనిపోయి తెలంగాణలో ఉన్నటువంటి 23 ఏకలవ్యాల్లో హిందీ ఇంగ్లీష్ భాష నైపుణ్యం ఉన్న స్థానిక ఉపాధ్యాయుల్ని నియమించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏకలవ్యయాలలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వివరణను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి పంపించాలని విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడోద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అజిత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మనోజ్, సన్నీ, బన్నీ, వికాస్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ekalavyas are a place of problems

You cannot copy content of this page

Scroll to Top