సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Chief Minister Teleconference

Chief Minister Teleconference : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 24 ; తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ ల తో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రిజర్వాయర్లు, నదుల్లోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని వెల్లడించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించాలని స్పష్టం చేశారు. ప్రజలకు త్రాగునీరు, ఆహారం, మందులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page