Trinethram News : ప్రియురాలు తనను దూరం పెడుతోందన్న కక్షతో ఓ యువకుడు (27) ఆమెను కత్తితో పొడిచి చంపాడు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. ఈ ఘటనలో బాధితురాలి మేనకోడలు కూడా గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ, ఆమె మేనకోడలు, మేనల్లుడితో కలిసి నిన్న టైలరింగ్ షాపు నుంచి ఇంటికి తిరిగి వస్తోంది. అదే సమయంలో అక్కడ కాపుకాసిన నిందితుడు ఆమెపై కత్తితో దాడిచేశాడు. విచక్షణ రహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె మేనకోడలికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.మృతురాలు, నిందితుడు ఒకరికొకరు తెలుసునని పోలీసులు తెలిపారు. ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తుండడంతో ఆమె అతడికి దూరంగా ఉంటోంది. ఆమె తనను దూరం పెడుతుండడాన్ని జీర్ణించుకోలేకపోయిన నిందితుడు కాపుకాసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు…
దూరం పెడుతోందని.. పట్టపగలు అందరూ చూస్తుండగానే యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
Related Posts
నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో
TRINETHRAM NEWS నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో Trinethram News : నిర్మల్ : బస్సులో అడ్డంగా లగేజీ పెట్టిన మహిళ ప్రయాణికురాలితో కండక్టర్ వాగ్వాదం నిర్మల్ డిపోకు (టీఎస్ 18…
Film Chance : సినిమా ఛాన్స్ కోసం వెళ్లిన మహిళకు
TRINETHRAM NEWS సినిమా ఛాన్స్ కోసం వెళ్లిన మహిళకు Trinethram News : హైదరాబాద్ : జనవరి 18 : ఒక్క ఛాన్స్ అంటూ సినిమా రంగంలోకి అనేక మంది వస్తుంటారు. ఒక్క ఛాన్స్ రాకపోదా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు.…