TRINETHRAM NEWS

A petition has been submitted to the Minister of Water and Drainage to take up the construction of Pattipaka Reservoir

మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్ లోని తెలంగాణ డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని మంగళవారం రోజున పెద్దపల్లి జిల్లా రైతన్నల చిరకాల స్వప్నం అయిన పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని ఐటి మరియు పరిశ్రమల శాఖల మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు ప్రభుత్వ విప్ , ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆది శ్రీనివాస్ గార్లతో పాటు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేసి పెద్దపల్లి రైతన్నల నీటి కష్టాలను అతి త్వరలో తీర్చాలని కోరిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి జిల్లాలో ప్రధానంగా D83 మరియు D86 కాలువల ద్వారా 2,20,000 ఎకరాల ఆయకట్టు ఉందని అదేవిధంగా చివరి ఆయకట్టు వరకు ప్రస్తుతం విడుదల చేస్తున్న నీరు తగినంతగా అందడం లేదు అని తద్వారా పంట పొలాలు సాగు విస్తీర్ణం తగ్గిపోయే అవకాశం ఉంటుందని ఇలా జరగకుండా ఉండాలంటే పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని ఆ రిజర్వాయర్ నిర్మాణం చేపడితేనే పెద్దపల్లి జిల్లా రైతన్నల నీటి పారుదల సమస్యలు తీరతాయని తద్వారా ఈరోజు నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఐటి మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు ప్రభుత్వ విప్, తదితర ఎమ్మెల్యేలతో కలిసి వినతి పత్రం అందజేసామని దేనికి మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులను రిజర్వాయర్ నివేదికలు అందించాలని ఆదేశించడం జరిగింది అని
ఈ సందర్భంగా తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A petition has been submitted to the Minister of Water and Drainage to take up the construction of Pattipaka Reservoir