దేవరకొండ ఆగష్టు 10 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనము నందుఆపిల్ ఫ్రూట్ మొక్కను అధ్యక్షుడు NVT, సభ్యులతో కలిసి నాటడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ చెట్లు పెంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఇవి పర్యావరణానికి ప్రజలకు జంతువులకు ఎంతో మేలు చేస్తాయని, గాలిని శుద్ధి చేస్తాయి నీటిని సంరక్షిస్తాయి అని వాతావరణ మార్పులను ఎదురుకోవడానికి సహాయపడతాయని, ఆక్సిజన్ అందిస్తాయని ఎన్నో లాభాలు ఉన్నాయని సందర్భంగా వారు అన్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందల ఒక మొక్కను నాటాలని, అలాగే వ్యాపారం చేసే వారు కూడా తమ షాపుల ముందల ఒక మొక్కను నాటాలని అన్నారు ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉంటున్నాయి దానికి కారణం చెట్లు లేకపోవడం వల్లనేనని దయచేసి ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించాలని , ఇంతకుముందు రోడ్డు ఇరువైపులా వేప చెట్లు కానుగ చెట్లు వుండేవని రోడ్డు వెడల్పులో భాగంగా వాటిని తొలగించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, K పంతులాల్ నాయక్, సముద్రాల వెంకన్న,V భాస్కర్ రెడ్డి ,ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ల సురేష్, జగదీశ్వరా చారి, జమీర్ కరాటే మాస్టర్ చైతన్య, బత్తుల సురేష్, రమేష్, డాన్స్ మాస్టర్ ఏడుకొండలు, లక్ష్మణ్, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


