Indiramma Houses : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

TRINETHRAM NEWS
Indiramma Houses All Eligible Beneficiaries

ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

Indiramma Houses : దేవరకొండ డివిజన్ జూన్ 10, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి, రెండవ విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై ఎంపీడీవోలు మరియు హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.. అర్హులైన పేద కుటుంబాలు ఏ కారణం చేతనైనా L3 జాబితాలో ఉన్నట్లయితే, వారి అర్హతలను పరిశీలించి L1 జాబితాలోకి మార్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా గుడిసెలు, మిద్దెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇచ్చి వారికి శాశ్వత గృహాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా అర్హులైన లబ్ధిదారులకే అందజేయబడతాయని స్పష్టం చేశారు.
పార్టీలకు అతీతంగా, నిజమైన అర్హులను గుర్తించి గృహాలు మంజూరు చేసి గుడిసెలు లేని దేవరకొండ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుతం 226 గుడిసెలు ఉన్నాయని, ఆ కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు మీరు నిర్మించుకున్న ఇండ్లకు, బేస్ మెంట్ లెవెల్, స్లాబ్ లెవెల్ గోడలు, పూర్తిగా నిర్మాణం కానీ ఇండ్ల దశను బట్టి ఇందిరమ్మ ఇల్లులోకి మార్చుకొని డబ్బులు డబ్బులు మీ ఖాతాలోకి జమ అయ్యేలా చేస్తాం.
ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో ఎవరైనా అధికారులు లేదా ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే సస్పెన్షన్ చర్యలు కూడా చేపడతామని హెచ్చరించారు. మొదటి విడతలో మంజూరైన ఇండ్లలో ఇప్పటివరకు బిల్లులు విడుదల కాకపోయిన వాటికి సంబంధించిన సమస్యలను గుర్తించి, అర్హులైన లబ్ధిదారులకు బిల్లుల మొత్తాలు త్వరితగతిన జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో హౌసింగ్ శాఖ అధికారులు, ఎంపీడీవోలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top