
Indiramma House : త్రినేత్రం న్యూస్ : Apr 01, 2026, తెలంగాణ : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో లక్షమంది నూతన గృహాల్లోకి అడుగుపెట్టే విధంగా గృహనిర్మాణ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మంచి రోజులను ఎంపిక చేసి తేదీలను ఖరారు చేసింది.
ఏప్రిల్ నెలలో 1, 20, 21, 30 తేదీల్లో, మే నెలలో 4, 8, 13, 14, 18, 25, 27, 28 తేదీలతో పాటు జూన్ మొదటి వారంలో లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు ముహూర్తాలను ఖరారు చేసింది. ఇవాళ 4,100 మంది లబ్ధిదారులు గృహాప్రవేశాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి నాటికి మొత్తం 33 వేల ఇళ్లు ప్రవేశాలు పూర్తి చేయనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

