Employment Guarantee Scheme : ఫీల్డ్ అసిస్టెంట్ లేక ఉపాధి హామీ పనులు బంద్

TRINETHRAM NEWS
Employment Guarantee Scheme stalled due to the absence of a Field Assistant

కంబాలపల్లి ఆనంద్. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు.

Employment Guarantee Scheme : చందంపేట జూన్ 10, త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం గాగిళ్ళ పురం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేడని కారణంతో నేటికీ పనులు ప్రారంభించకపోవడం బాధాకరమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ ఆరోపించారు గాగిళ్ళ పురం గ్రామంలో ఉపాధి కూలీలతో ఈనెల 12న తిప్పర్తి మండలం దుప్పలపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమంలో ఆనంద్ మాట్లాడుతూ కొన్ని నెలల నుండి ఉపాధి పనులు కల్పించాలని కూలీలు అధికారులను విన్నవించుకున్న నేటికీ పనులు కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్యంగా భావించవలసి వస్తుంది అధికారులు వివిధ కారణాలతో ఫోటోలు అప్లోడ్ చేసే వారు లేరని టెక్నికల్ అసిస్టెంట్ నాలుగు గ్రామపంచాయతీలు చూస్తున్నామని కారణాలతో గ్రామంలో పనులు కల్పించకపోవడం వల్ల ఒక్కొక్క కూలికి 80 రోజులు పని దినాలు వేసుకున్న రోజు కూలి 300 చొప్పున 24 వేలు నష్టపోయారని వారు తెలిపారు పని లేని సమయంలో పనులు కల్పించే కల్పించే ఉద్దేశం ఉపాధి హామీ చట్టం దానిని నీరుగాస్తున్నారని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ముఖ్యంగా ఎంపీడీవో పరిశీలించి తక్షణమే పనులు కల్పించాలని కోరారు ఈనెల 12న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభలు ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాసారం సీనయ్య పుష్పమ్మ శీను ఈశ్వరయ్య శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top