MLA Nenavat Balu Naik : అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తా

TRINETHRAM NEWS
సంక్షేమ పథకాలకు ప్రజల్లో విశేష స్పందన.

ప్రజా పాలన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
దేవరకొండ (చందం పేట) ఆగష్టు 26 త్రినేత్రం న్యూస్. చందంపేటమండల కేంద్రంలో ”జనహిత – ఎం ఎల్ ఏ మార్నింగ్ వాక్ విత్ పీపుల్ ” కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పర్యటించి,గ్రామ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలు ఎం ఎల్ ఏ బాలు నాయక్ పరిష్కరించారు .జనహిత మార్నింగ్ వాక్ కార్యక్రమం దేవరకొండ ప్రజల గొంతుక.

ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామ సమస్యలు మరియు ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చూపించేందుకు తాను కట్టుబడి ఉన్నారన్నారు. ప్రజలతో కలిసి నడవడం వారి సమస్యలను వినడం వాటికి పరిష్కారం చూపడం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని హామీ ఇచ్చారు. పలు వార్డులలో పర్యటిస్తూ నూతనంగా 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. రైతు రుణమాఫీ , రైతు భరోసా , రేషన్ కార్డులు , ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి స్పందన ఉంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు,వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Indiramma will grant houses to everyone

You cannot copy content of this page

Scroll to Top