
లక్షలాది ఉద్యమకారుల పోరాటం. కోట్లాది ప్రజల ఆకాంక్ష వెలసి ఏర్పడిన స్వరాష్ట్రం.
నేనావత్ బాలు నాయక్ శాసనసభ్యులు.
MLA Nenavat Balu Naik : దేవరకొండ డివిజన్ జూన్ 02, త్రినేత్రం న్యూస్. అవమానాలు, అసమానతలను అంతం చేస్తూ, ఆత్మగౌరవమే ఊపిరిగా, స్వరాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ నేడు దేవరకొండ పట్టణంలోని RDO, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని అందరికీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు.. కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యం చేసిన సోనియమ్మ గారికి దేవరకొండ ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.
తెలంగాణ సాధన కోసం ఎన్నో ఏళ్ల పాటు జరిగిన ఉద్యమాలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, విద్యార్థుల పోరాటాలు, ఉద్యోగుల సమ్మెలు, అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల అంకితభావం ఫలితంగానే నేడు మన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఉద్యమంలో ప్రతి గ్రామం పోరాడింది… ప్రతి కుటుంబం త్యాగం చేసింది… ప్రతి ఉద్యమకారుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. వారి కృషి,త్యాగాలు చిరస్మరణీయం.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు,అమరవీరులకు, ప్రజా పోరాట యోధులకు వినమ్ర నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
