జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Telangana Formation Day Celebrations

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి …తీదేడు గ్రామ సర్పంచ్

Telangana Formation Day : చింత పల్లి జూన్ 02, త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని చింతపల్లి మండలం తీదేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు…రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు హృదయపూర్వక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను ఆమె స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.తెలంగాణ ప్రజల మీద దశాబ్దాల పాటు సాగిన అణచివేతపై పోరాడి,అనేక ఆవాంతరాలను అధిగమించి, శాంతియుతమైన పార్లమెంటరీ పంథాలో,ప్రజాస్వామ్య యుతంగా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆమె తెలిపారు.సాగునీరు,తాగునీరు, విద్యుత్,వ్యవసాయం,విద్య వైద్యం తదితర సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

ఒకనాడు ఎడారిలా మారిన తెలంగాణను,నేడు కోటి ఎకరాల మాగాణంగా మార్చి, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత నాటి పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, మాజీ ఉప సర్పంచ్లు ఉలుపాల శేఖర్ రెడ్డి,ధరణిపతి రమణారావు,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్,సందె లక్ష్మయ్య, మర్ల యాదగిరి,శివర్ల పర్వతాలు,గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, ప్రాథమిక, మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు,గ్రామ పంచాయతీ మల్టిపర్పర్స్ వర్కర్లు,వివిధ పార్టీల నాయకులు,గ్రామ గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page