TVC Charitable Trust : టివిసి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి సాయం

TRINETHRAM NEWS
TVC Charitable Trust provides assistance

TVC Charitable Trust : త్రినేత్రం న్యూస్, కడియం : కడియం అరుంధతి పేటలో శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా కుడేలి చిన్న అమ్ములు కుటుంబానికి చెందిన తాటాకిల్లు దగ్ధమయింది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామన్లు కాలి బూడిద అయ్యాయి. టివిసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి బాధిత కుటుంబాన్ని సోమవారం ఉదయం పరామర్శించారు. నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు, చీరలు, వంట సామగ్రి, ఐదు వేల రూపాయలు నగదు అందజేశారు.

ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు సహాయం అందించాలని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడాల అర్జునరావు, దొడ్డా బుజ్జి, సాపిరెడ్డి కామేష్, చిరుకూరి రామకృష్ణ, గణేశుల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top