YSR Congress Party : వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కీర్తి “శేషులు దొమ్మేటి వెంకటరెడ్డి, 173.వ జయంతి వేడుకలు

TRINETHRAM NEWS
YSR Congress Party Office Celebrates

ఘనంగా నిర్వహించిన చెల్లుబోయిన వేణు

YSR Congress Party : త్రినేత్రం న్యూస్, స్థానిక బోమ్మూరు వై.యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రముఖ సంఘ సంస్కర్త,విద్యాదాత,స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 173.వ జయంతి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కులాన్ని బలోపేతం చేయడానికి ఎనలేని కృషి చేశారని బీసీ ఉప కులాల అభ్యున్నతికి ఎంతగానో పాటు పడిన మహా వ్యక్తి దొమ్మటి వెంకటరెడ్డి అని ఐక్యతతో అందరూ ముందుకు సాగాలని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరూ ముందుకు వచ్చి సంఘం కొరకు పోరాడాలని చాటిచెప్పిన వ్యక్తి అని ఆయన ఆశయ సాధన కోసం మనo అoదరం పాటుపడాలన్నారు.

ఆర్ధిక ఇబ్బందుల వల్ల విద్యకు దూరమైన బడుగు బలహీన వర్గాల పిల్లలకు పాఠశాల వద్దే భోజనం ఏర్పాట్లు చేసి విద్యను అందించిన విద్యాదాత దొమ్మేటి వెంకటరెడ్డి,ని స్మరించు కుంటూ,ఆయన చేసిన అనేక సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గిరజాల బాబు,రేలంగి సత్యనారాయణ,చెల్లుబోయిన నరేన్,వేముల ఏసుబాబు,కట్టా జామిందర్,డా“చోల్లంగి సత్యగిరి,పితాని హరికృష్ణ,చాప రాజా,అయినవిల్లి వెంకటేశ్వరరావు,అనెం శ్రీను,తీగిరెడ్డి శ్రీను,షేక్ సమీరా,ఓడూరి రామకృష్ణ,సుందరపల్లి అనిల్,యాళ్ల కృష్ణంరాజు,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top