
నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం
MLA Vegulla : త్రినేత్రం న్యూస్, మండపేట నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. మండపేట పట్టణం 13వ వార్డులో ప్రజల చిరకాల కోరికైన బిసి కమ్యూనిటీ హాల్ నిర్మాణం నకు శుక్రవారం ఎమ్మెల్యే శంఖుస్ధాపన చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ జనరల్ నిధులు రూ.36.00 లక్షలతో ఈ కమ్యూనిటీ హాల్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతీ నియోజకవర్గాన్ని అభివృద్ది బాట పట్టిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, పాలచర్ల బ్రహ్మాజీ, పలివెల వెంకటేశ్వరరావు, సొసైటి అధ్యక్షులు కుక్కల రామారావు, పలివెల సత్యప్రకాష్, పలివెల జానకి రామన్న, చెలబోయిన వీర్రాజు, గీసాల సత్తిబాబు, శీలం జ్యోతి, కుక్కల బూరయ్య, కుక్కల భాస్కరరావు, కుక్కల నాగేష్, ముసిని వెంకటేష్, ముసిని సత్యనారాయణ, కుక్కల నాగబాబు, కుక్కల సత్యనారాయణ, సానబోయిన దుర్గారావు, సానబోయిన రాజు, అల్లక ప్రసాద్, ఆతపు శ్రీను, తదితరులు పాల్గొన్నారు…

