MLA Vegulla : థ్యాంక్యూ ఎమ్మెల్యే సార్

TRINETHRAM NEWS

జిల్లా విలీనంపై ఎమ్మెల్యే వేగుళ్ళ కు ఎంపీఎస్ అపూర్వ స్వాగతం…

ఎంపీఎస్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

విద్యార్థులతో కలిసి ఆడి పాడిన వేగుళ్ళ…

త్రినేత్రం న్యూస్, మండపేట ఎంపీఎస్ విద్యా సంస్థల ఆవరణలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, విద్యార్థులతో కలిసి సందడి చేశారు. విద్యార్థినులతో కలసి ఆయన నాలుగు స్టెప్పులేశారు. ఈ వాతావరణం అక్కడ ప్రత్యేక సందడిని తీసుకువచ్చింది.

అంతకు ముందు స్కూల్ ప్రాంగణానికి విచ్చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ కు ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత వల్లూరి చిన్నారావు ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థినులు, ఉపాధ్యాయులు అపూర్వ స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా పూలతో స్వాగతం పలికి మా భవిష్యత్ కు బాటలు వేసి మా మనస్సుల్లో, చిరస్థాయిగా నిలిచారని నినాదాలు చేస్తూ థ్యాంక్యూ ఎమ్మెల్యే సార్ అని ముక్త కంఠాలతో నినదించారు. విద్యార్థుల ప్రేమాభిమానానికి ఎమ్మెల్యే వేగుళ్ళ మురిసిపోయారు.

సంక్రాంతిని, పురస్కరించుకుని స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టు, బొమ్మల కొలువు, హరిదాసుల సంకీర్తనలు తదితర వివిధ వేషాలతో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. సంక్రాంతి శోభ మొత్తం స్కూల్ వద్దే కనిపించింది. తల్లిదండ్రులు సంక్రాంతి సందడి నడుమ సరదాగా ఫోటోలు దిగారు. ఉపాధ్యాయులు తయారు చేసిన సాంప్రదాయ పిండి వంటలు పలువురు రుచి చూసి ప్రశంసించారు.

సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు మెరిసిపోయారు. నాలుగురోజులు ముందే సంక్రాంతి శోభను తీసుకొచ్చారు అంటూ ఎమ్మెల్యే వేగుళ్ళ స్కూల్ అధినేత చిన్నారావు ను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాపకులు వల్లూరి విజయానంద పార్థసారథి, అనంతలక్ష్మి, వల్లూరి సింధు, కృష్ణ వేణి, అర్జున్, స్కూల్ ప్రిన్సిపాల్ సిరిల్ల గణేష్, కళాశాల ప్రిన్సిపాల్ దేవళ్ళ సాయి గంగాధర్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Thank you MLA sir

You cannot copy content of this page

Scroll to Top