
Corruption : త్రినేత్రం న్యూస్ : అవినీతి నిరోధక చట్టం కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పొదుపు సంఘాల మహిళలపై ఆర్పీల దోపిడీ. ప్రతి జిల్లాల్లో అన్ని గ్రామాలలోజరుగుతున్న దోపిడీ… లోన్ మంజూరు అయితే ఒక్కో మహిళ వద్ద నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఒక గ్రూప్‌లో 10 మంది సభ్యులు ఉంటే ఒక్క గ్రూప్ నుంచే ₹10,000 వసూలు అవుతోంది. ఒక ఆర్పీ కింద కనీసం 10 గ్రూపులు ఉంటే మొత్తం లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇలా తీసుకున్న నగదులో పై స్థాయి అధికారులకు కొంత నగదు ఇవ్వటం మామూలే అన్నట్లు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు.. లోన్ తీసుకున్న మహిళలు బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుండగా, వడ్డీ డబ్బు తిరిగి వచ్చినప్పుడు కూడా అందులో కమిషన్లు వసూలు చేయడం గమనార్హం. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కొందరు మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎప్‌ఐఆర్‌లను రద్దు చేసిన హైకోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు.. ఏసీబీ నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు చేయాల్సిందే.. ఎఫ్‌ఐఆర్‌లు కొట్టేయడం కుదరదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.. రద్దు చేసిన ఎఫ్‌ఐఆర్‌లపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశం

