BC Communities : తెలంగాణలోని సబండ బీసీ వర్గాల కోసం పోరాడుతున్న తీన్మార్ మల్లన్న

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: తీన్మార్ మల్లన్న కార్యాలయం పై ఆదివారం ఉదయం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో వారి అనుచరులతో తీన్మార్ మల్లన్న పై దాడి చేయడం జరిగింది, ఈ విషయంపై వికారాబాద్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు ఘనపురం శ్రీనివాస్ ,ఆధ్వర్యంలో జిల్లాలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మను దగ్ధం చేసి కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది అనంతరం తీన్మార్ మల్లన్న టీం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఘనపురం శ్రీనివాస్ మాట్లాడుతూ.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సబ్బండ వర్గాల కోసం పోరాడుతున్న తీన్మార్ మల్లన్న పై, మల్లన్న కార్యాలయం క్యూ న్యూస్ ఆఫీస్ పై కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అనుచరులతో , గతంలో నయుం ముఠాలో పనిచేసినటువంటి కొందరు వ్యక్తులచే మల్లన్నను హతమార్చేందుకు ప్రయత్నం చేసిన సందర్భంలో, చాకచక్యంగా మల్లన్నకు ప్రాణాపాయం నుండి రక్షించేందుకు మల్లన్న గన్మెన్లు వ్యవహరించిన తీరుని, ప్రశంసించారు, తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలలో తప్పేమీ లేదని కంచం పొత్తు,మంచం పొత్తు, అనే పదాలకు, మీ నాన్నను అడిగి అర్ధాలు తెలుసుకో , తెలంగాణ ఇతిహాసం తేలుకోవాలని ,కనీస అవగాహన లేక అవగాహన రాహిత్యంతో దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని,మీ పార్టీలో నీకు మనుగడ లేక, నిన్ను ఎవరు పట్టించుకోవడంలేదని నీ మనుగడ కోసం ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే, ఊరుకునేది లేదని, తీన్మార్ మల్లన్న అంటే ఏమిటో మీ నాన్నని అడిగి తెలుసుకొ ఇంకొకసారి ఇలాంటి దాడులకు పాల్పడితే నీ అంతు చూస్తామని , రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన అడ్డుకొని తీరుతామని ఖబర్దార్ కవిత అని హెచ్చరించారు.

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న కల్వకుంట్ల కవిత శాసనమండలి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి విజ్ఞప్తి చేయడం జరిగింది. కవిత చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి . కానీ తెలంగాణలో ప్రతిదానికి , మండలికం ఇతిహాసాలు ఉంటాయి వాటిని చాలా సందర్భాల్లో తెలంగాణ పౌరులు ఉపయోగిస్తుంటారు. ఏదేమైనా మరో మారు తీన్మార్ మల్లన్న పై అవాకులు ఉత్సవాకులు మాట్లాడితే దాడి చేయించాలని ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఘనపురం శ్రీనివాస్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పరిగి నియోజకవర్గం ఇంచార్జ్ వేమన్న , వికారాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ జగదీష్ చారి , వికారాబాద్ మండల అధ్యక్షులు ఏం సంతోష్ , నవబు పెట్ అధ్యక్షులు కె.హరీష్ , మరియు ఫయాజ్ , కార్తీక్ , మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Teenmar Mallanna is fighting

You cannot copy content of this page

Scroll to Top