MLA Vasantha Krishnaprasad : త్రినేత్రం న్యూస్ : ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, 14.03.2026. ప్రవాస భారతీయులు కోమటి జయరాం ఆత్మీయ సత్కారంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఉత్తర అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి పదవిలో నియమితులైన కోమటి జయరాం ఆత్మీయ సత్కారం కార్యక్రమం మురళి రిసార్ట్స్, పోరంకి, విజయవాడలో శనివారం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కోమటి జయరాం కి శుభాకాంక్షలు తెలిపారు.అమెరికాలో తెలుగుదేశం పతాకాన్ని సగౌరవంగా, సగర్వంగా ఎగురవేసి తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి దశాబ్దాలుగా కృషి చేస్తున్న తెలుగు వెలుగుల మేటి కోమటి జయరామ్ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉత్తర అమెరికాలో తెలుగు వారి సంక్షేమానికి మరింత పాటుపడగలరని ఆకాంక్షించారు.


