Nagarvasi Durga Rao : జాతీయ కబడ్డీ పోటీలకు నగర వాసి దుర్గారావు ఎంపిక

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం ఫిబ్రవరి 25 ఈనెల 26 27 28 తేదీలలో గుజరాత్లో జరగనున్న 72వ నేషనల్ పురుషుల కబడ్డీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ టీం తరఫున రాజమండ్రి కి చెందిన పిట్ట దుర్గారావు ఎంపిక అయ్యారని తూర్పుగోదావరి జిల్లా కబడి అసోసియేషన్ అధ్యక్షులు పేరం రవీంద్ర, సెక్రటరీ బురిడీ త్రిమూర్తులు తెలిపారు.

పిట్టా దుర్గారావు శ్రీ స్వామి వివేకానంద మెమొరియల్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ నుండి అనేకసార్లు నేషనల్ కబాడీ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. కబడ్డీ క్రీడాకారుడు దుర్గారావు ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీం కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడని, ఇది చాలా సంతోషకరమైన విషయమని వారు పేర్కొన్నారు.

ఈ సందర్బంగా పేరం రవీంద్ర, చైర్మన్ చంద్రశేఖర్, సెక్రటరీ బురిడీ త్రిమూర్తులు, అసోసియేషన్ సభ్యులు దుర్గారావుని అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Nagarvasi Durga Rao selected for National Kabaddi

You cannot copy content of this page

Scroll to Top