త్రినేత్రం న్యూస్, అనపర్తి మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ఓల్డ్ టౌన్, అనపర్తి విద్యార్థినులు జిల్లా స్థాయి భాషోత్సవాలలో ప్రతిభ కనబరచి పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన భాషోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 20న పాఠశాల స్థాయిలో జరిగిన తెలుగు మరియు హిందీ వ్యాసరచన పోటీలలో అర్హత సాధించిన విద్యార్థినులు ఫిబ్రవరి 23న మండల స్థాయిలోనూ తమ ప్రతిభను నిరూపించుకుని, జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. ఫిబ్రవరి 24 న జిల్లాస్థాయిలో కూడా ఉత్తమ ప్రదర్శన కనబరిచి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ కె. వాసుదేవ రావు గారి చేతుల మీదుగా మెడల్స్, ప్రశంసా పత్రాలు అందుకున్నారు
జిల్లా స్థాయి పోటీలలో:
ఎం. మల్లిక – తెలుగు వ్యాసరచనలో 3వ స్థానం
జి. హర్షిణి – హిందీ వ్యాసరచనలో 3వ స్థానం
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. సుజాత గారు విజేతలైన విద్యార్థినులను అభినందించారు. అలాగే వారిని పోటీలకు సన్నద్ధం చేసిన అధ్యాపక బృందాన్ని, గైడ్ టీచర్ డి. స్రవంతి గారిని ప్రశంసించారు.
ఉపాధ్యాయ బృందంలోని జి. సత్తిరెడ్డి, జి. పట్టాభి, బి. హరి ప్రసాద్ రావు, బి.వి. పద్మకుమారి, కె. పద్మావతి, ఏ. శ్రీలత, డి. శేషాయమ్మ, కె. సూర్య సతీష్ రాజా, ఎం. సురేష్, ఎం.డి. సఫీర్ అహమద్, వి.వి. సత్యనారాయణమూర్తి… టి. బంగారు నాయుడు , కాలేషా, కె. శివశంకర్, ఎన్. ప్రశాంతి, కె. విజయ కుమారి, పి. మణికంఠ కుమార్, టి. ఉమ, ఎం. అనిరుధ్, ఎం. మాలతి గార్లు కూడా విద్యార్థినుల విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న మా పాఠశాల యాజమాన్యం, భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలియజేసింది.
— పాఠశాల యాజమాన్యం
జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ఓల్డ్ టౌన్, అనపర్తి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


