Byrapaka Srinivas met Commissioner : కమిషనర్ డాక్టర్ అజయ్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వైద్య విధాన పరిషత్ జేఏసీ కోర్ కమిటీ మెంబర్ బైరపాక శ్రీనివాస్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ జిల్లా ప్రతినిధి… వైద్య విధాన పరిషత్ రద్దు చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మారుస్తూ రెండు రోజుల కింద మంత్రి వర్గ సమావేశం లో నిర్ణయం తీసుకున్న సందర్భంగా మన ప్రియతమ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ను వైద్య విధాన పరిషత్ జాయింట్ యాక్షన్ కమిటీ కోర్ కమిటీ మెంబర్ బైరపాక శ్రీనివాస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కొన్ని ముఖ్యమైన డిమాండ్స్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు

1. 317 జీవోను ఇంప్లిమెంట్ చేస్తూ ప్రమోషన్స్ కల్పించాలని కోరారు.2. వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్ చేయాలని చెప్పారు.
జేఏసీ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి టీవీవీపీ నుండి జేఏసీ వ్యవస్థాపకులు సోమ మల్లన్న,  ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వినయ్ కుమార్ ,  జేఏసీ చైర్మన్ గా  ప్రధాన భూమిక పోషించిన ఎమ్మెస్ మూర్తి ,ప్రెసిడెంట్ డాక్టర్ రాహుఫ్ ముఖ్యమైన పాత్ర పోషించిన వారిలో ఉన్నారు.

ఈ ప్రకటన రావడానికి ముందు రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి జేఏసీ ఐక్యవేదిక ద్వారా ప్రతి సిఎస్సి ,ఏరియా హాస్పిటల్ జిల్లా ఆస్పత్రిలో అందరూ మాస్ రెప్రెటేషన్ ద్వారా సంతకాలు చేసి ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు గుర్తించి ఉద్యోగుల చిరకాల వైద్య విధాన పరిషత్ రద్దు చేస్తూ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ సర్వీసెస్ గా మారుస్తూ క్యాబినెట్లో మొన్న 23వ తేదీ ఫిబ్రవరి 2026 రోజున నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషమైన విషయం.

ఈ సందర్భంగా ప్రభుత్వం సమాలోచనచేసి మా ఆకాంక్షను ప్రభుత్వనికి మాకు వారధిగా ఉంటూ న్యాయం చేసిన   కమిషనర్ డాక్టర్ అజయ్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సంపూర్ణంగా తెలియపరచారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సభ్యులు ఆఫీస్ ముందట టపాకాయలు పేల్చుతూ, స్వీట్ పంచుతూ సంబరంగా నాట్యం చేశారు…

ఈ కార్యక్రమంలో ఎం. మరియమ్మ సిస్టర్ , మహమ్మద్ యూనస్ , సత్యనారాయణ రెడ్డి , బి పాండు , శైలజ , క్రిప్టాఫర్ , ఆదిలక్ష్మి , పరాబ్ కుమార్ ,డేవిడ్ , వీరేష్ బాబు,అమృత రావు , ఆంజనేయులు , రవికుమార్, బిక్షపతి, విష్ణు , అలీ, కే వెంకట్ రెడ్డి , బాబురావు , మధుసూదన్ రెడ్డి, కరుణాకర్ , అరుణ్ కుమార్ , ఏ ప్రమీల, పిడి స్వర్ణలత, భూలక్ష్మి, ఇందిరా శ్రీలక్ష్మి , రామారావు, కొత్తపల్లి భరత్ రెడ్డి, శ్రీదేవి, ఝాన్సీ రాణి, భాగ్యమ్మ వీరితో పాటు చాలామంది వివిధ సంఘాల నాయకులు మరియు కేటగిరి ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Byrapaka Srinivas met Commissioner Dr. Ajay

You cannot copy content of this page

Scroll to Top