Bail for Ibomma Ravi : ఐబొమ్మ రవికి బెయిల్.. కానీ ఒక కండీషన్

TRINETHRAM NEWS

Trinethram News : ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది. ప్రతి రోజూ పోలీసు స్టేషన్‌ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది. దేశం విడిచి వెళ్లొద్దని షరతు పెట్టింది. ఇంటర్నెట్ వినియోగించకూడదని, ఒకవేళ ఇంటర్నెట్ వినియోగించాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

  • ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
  • ప్రతి రోజూ సీసీఎస్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశం
  • ఐబొమ్మ రవి తన పాస్‌పోర్ట్‌ను కోర్టులో సరెండర్ చేయాలన్న కోర్టు
  • దేశం విడిచి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించిన కోర్టు
  • ఇంటర్నెట్‌ను వాడొద్దని, వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలన్న కోర్టు
  • సినిమా పైరసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఐబొమ్మ రవి

రవి టెలిగ్రాం యాప్ ద్వారా సినిమాలను కొనుగోలు చేసి, వాటిని ఐబొమ్మ సైట్లో రిలీజ్ చేస్తున్నట్లు బయటపడింది. సైట్‌లో సినిమా క్లిక్ చేయగానే యూజర్లను మ్యాట్రిమోని, బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు మళ్లించేలా 15కు పైగా యాడ్ నెట్‌వర్క్‌లను లింక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మన దేశంలోని ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా వచ్చిన డబ్బును రవి క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు పంపించాడని విచారణలో వెల్లడైంది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bail for Ibomma Ravi

You cannot copy content of this page

Scroll to Top